YSR Jayanthi Celebrations: వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్, షర్మిల కీలక వ్యాఖ్యలు వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ స్పూర్తితోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే తానే బాధ్యత తీసుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారంటూ వైఎస్ షర్మిలా పరోక్షంగా జగన్‌ను విమర్శించారు. By B Aravind 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి YSR Jayanthi Celebrations: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్‌తో ఉన్న తమ అనుభవాలను, ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 'YSR జ్ఞాపకాలు మనకు శాశ్వతం. ఆయనే సంక్షేమ పథకాల సృష్టి కర్త. YSR జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవాళ్ళ గుండెల్లో బల పడుతున్నాయి.YSR లేని లోటు మనకు స్పష్టం గా కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువ లేదు. YSR తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. అప్పట్లో మొదటి సారి శాసనమండలిలో నేను అడుగు పెట్టాను.YSR దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని. పిల్లవాడు అని కాకుండా YSR ప్రతి అంశానికి సమాధానం చెప్పేవారు. కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనేవారు. వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనేవారు. కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనేవారు. ఇదే నాయకుడు లక్ష్యం. Also Read: వైఎస్ మాకే సొంతం.. కాంగ్రెస్ VS వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా YSR తీరు మనకు ఆదర్శం. ఎవరు వినతి పత్రం ఇచ్చినా...అందరికీ సమయం ఇచ్చే వాడు. ప్రజా దర్బార్ లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించేవారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆనాడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని (Congress Party) అధికారంలో తెచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తి తో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ జోడో యాత్రతో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు. ఇవ్వాళ ఏపిలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది. 2009 నుంచి ఈనాడు వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది. ప్రతిపక్ష హోదా నుంచి 2004 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపిలో కొనసాగిస్తుంది.ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అంటే బాబు,జగన్,పవన్. ఇక్కడ అంతా బీజేపీ పక్షమే. ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమే. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుతోంది. 2024లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం. YSR పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసులు కాదు. ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్ళే నిజమైన వారసులు. YSR ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మేము అండగా నిలబడతాం. ఇవ్వాళ మంత్రి వర్గాన్ని మొత్తం తీసుకురావడం ఇందుకు నిదర్శనం. షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తాం. కడపకు ఉపఎన్నికలు వస్తాయని అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వస్తే కడపలో గల్లి గల్లి తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ పొగుట్టుకున్నామో అక్కడ నుంచే గెలుపు సాధిస్తామని' రేవంత్ అన్నారు. Also Read: కాంగ్రెస్‌లో అలాంటి సీఎం వైఎస్ ఒక్కరే.. : ఉండవల్లి అరుణ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. 'YSR ను నేను ఆఖరిగా కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమి కానీ నన్ను దేవుడు ఇంత వాడిని చేశాడు. ఎంతో మంది పేదలకు జీవితం ప్రసాదించే అవకాశం ఇచ్చాడు అని అన్నాడు. జలయజ్ఞం పోర్టు అయితే రాష్ట్ర అభివృద్ధి అదే అన్నారు. 2009 ఎన్నికల ఫలితాల ముందు చాలా టెన్షన్ పడ్డారు. ఓడిపోతే జలయజ్ఞం పరిస్థితి ఏమిటి అని బాధపడ్డారు. రెండోసారి గెలిచాక మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారు. ఎన్నికలు అయ్యాక ప్రజల మధ్యకు వెళ్ళాలి అనే తొందర ఎవరికి ఉండదు. కానీ YSR అలా కాదు. పాలనలో పథకాలు అందుతున్నాయా ? లేదా? అని చూడాలి అనుకున్నారు. రెండో సారి గెలవడం YSR పని తీరుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి అని YSR నమ్మారు. అదే సమయంలో బీజేపీ కి YSR బద్ధ వ్యతిరేకి. బీజేపీ మతతత్వ పార్టీ. అందుకే తన జీవితంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP అంట కాగుతున్నారు. తెర వెనుక పొత్తులు పెట్టుకొని YSR ఆశయాలను తుంగలో తొక్కారు. బీజేపీ తో పొత్తులు పెట్టుకొనే వారు YSR వారసుడు ఎలా అవుతారు. రాహుల్ గాంధీనీ ప్రధాని కావాలని అనుకున్నారు. కాన YSR హయాంలో రాహుల్ చాలా చిన్న వాడు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ లాగే రాహుల్ ఆలోచనలు ఉన్నాయని గుర్తించారు. ఇవ్వాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద నాయకుడు. జోడో యాత్రకు YSR పాదయాత్ర స్ఫూర్తి అని చెప్పడం సంతోషమని' షర్మిల అన్నారు. #cm-revanth #telugu-news #telangana-news #ys-sharmila #ys-rajasekhar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి