CM Jagan:నేడు విజయనగరానికి ఆంధ్ర సీఎం జగన్

విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, మంత్రులు, సీఎం అందరూ స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆంధ్ర సీఎం జగన్ మృతులకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఈరోజు జగన్ విజయనగరం వెళ్ళనున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటూ...గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు.  

New Update
CM Jagan:నేడు విజయనగరానికి ఆంధ్ర సీఎం జగన్

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన రైలు ప్రమాదం ఘటనా స్థలిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నేడు వెళ్ళనున్నారు. ఇప్పటికే మృతులకు, గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఆయన ఈరోజు ప్రమాదం జరిగిన స్థలిని పరిశీలించడంతో పాటూ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. గాయపడిన వారిలో ఏపీ వాసులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సీఎం పర్యటకు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేశారని చెబుతున్నారు.

Also read:ప్రమాదం కారణంగా రద్దయిన ట్రైన్స్ వివరాలు ఇవే…

మరోవైపు ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు