National: ఎన్నికల ముందే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి.. పార్లమెంటులో ఆమోదం పొందిన ఐదేళ్ళకు పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. CAA ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి హింసించబడిన వలసదారులకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వాన్ని అందిస్తుంది By Manogna alamuru 11 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Citizenship Amendment Act: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019 అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019 డిసెంబర్‌లో ఆమోదం పొందింది. అప్పుడే దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ సీఏఏ చట్టానికి సంబంధించి పూర్తి నిబంధనలు రూపొందిచకపోవడంతో అమల్లోకి తీసుకురాలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర ప్రుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడు దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం అక్రమ వలసలను ప్రోత్సహించదని కేంద్ర స్పష్టం చేసింది. సీఏఏ డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు దేశంలోకి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్శీ మతాల వారికి పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రత్యేక చట్టం. భారత రాజ్యాంగంలోని 245(1) అధికరణం కింద దేశం మొత్తానికి లేదా దేశంలోని ఏదైనా కొంత ప్రతాంతానికి సంబంధించి చట్టం చేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సీఏఏ గురించి ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారని, వాళ్లను రెచ్చగొట్టారని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం పాక్, ఆఫ్ఘన్, బంగ్లా నుంచి భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇస్తామని ఆయన తెలిపారు. ఎవరి భారతీయ పౌరసత్వాన్ని లాక్కోవడం ఆ చట్టం ఉద్దేశం కాదని అమిత్ షా అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లు గురించి చర్చించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని విస్మరించిందన్నారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు చేయడం సామాజిక మార్పు అన్నారు. సెక్యులర్ దేశంలో మతపరమైన పౌరస్మృతులు ఉండవన్నారు. ఇప్పుడు చట్టం అమలుతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాని స్పష్టం చేశారు. Also Read:Movies: అవంటే ఇష్టం కానీ ఎవరూ ఆఫర్ చేయడం లేదు-నీహారిక #parliament #elections #central #loksabha #caa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి