Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

నెక్స్ట్ బెట్టింగ్ కింగ్ అంటూ యూట్యూబర్ అన్వేష్ మరో పోస్టు పెట్టాడు. వీఆర్ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు మూడేళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ మండిపాడ్డాడు. లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

New Update
Youtuber Anvesh Sensational Comments On V R Raja

Youtuber Anvesh Sensational Comments On V R Raja

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై అన్వేష్ పోరాటం చేస్తున్నాడు. తాజాగా మరో సెన్సేషనల్ ఇన్ఫర్‌మేషన్ అందించాడు. నెక్స్ట్ బెట్టింగ్ కింగ్ అంటూ అన్వేష్ మరో పోస్టు పెట్టాడు. వీఆర్ రాజా, క్రాంతి వ్లాగర్ వంటి యూట్యూబర్‌ పేర్లను తన పోస్టులో మెన్షన్ చేశాడు. ఇందులో భాగంగానే వీఆర్ రాజా పై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు మూడేళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ మండిపాడ్డాడు. సబ్‌స్క్రైబర్లను మోసం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యాడు. లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై అటాక్

కాగా కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై అన్వేష్ ఎటాక్ చేస్తున్నాడు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, హర్షసాయి టార్గెట్‌గా పలు వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రీసెంట్‌గా పులువురి టాలీవుడ్ సినీ ప్రముఖుల పైన కూడా విమర్శలు చేశాడు. అదే సమయంలో అటు అన్వేష్‌ను పలువురు ఇన్ఫ్లూయెన్సర్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ వాడే భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్వేష్ ప్రమోట్ చేసిన పలు వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

(betting-apps | Betting App Gang | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment