Saif Ali Khan Case: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 27న వెస్ట్‌బెంగాల్(West Bengal)లోని నదియా జిల్లాలో రైడ్స్ చేసి మహిళను ముంబై పోలీసులు(Mumbai Police) అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు ఆరుసార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని జనవరి 21 డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. దాడి చేసింది బంగ్లాదేశ్‌కు చెందని షరీఫుల్ ఫకీర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: నా భర్తను వెంటాడి చంపింది..మా అన్నలే.. సూర్యాపేట మర్డర్ లో సంచలన నిజాలు
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో BIG ట్విస్ట్..
బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు వాడిన ఫోన్ నెంబర్ ప్రస్తుతం అరెస్ట్ చేసిన మహిళ పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉందని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. సైఫ్ అలీపై దాడి కేసులో నదియా జిల్లాలోని చాప్రాలో ఖుఖుమోని జహంగీర్ షేక్ ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ముంబైకి తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ రిమాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బంగ్లాదేశీ షరీఫుల్ ఫకీర్‌కు ఆ మహిళ బాగా తెలుసు. ఫకీర్ ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి సమీపంలోని సరిహద్దు నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. ఖుఖుమోని జహంగీర్ షేక్‌తో షరీఫుల్ ఫకీర్ సన్నిహితంగా ఉన్నాడు. అరెస్ట్ అయిన మహిళది పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని అందులియా నివాసి అని నింధితుడు చెప్పాడు.
Also Read: రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!
Also Read: పూణెలో విస్తరిస్తున్న భయాంకరమైన వ్యాధి.. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు