Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్.. కంగుతిన్న నెటిజన్స్!

బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ తన ఇన్‌స్టా స్టోరీలో సంచలన పోస్ట్ పెట్టింది. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసులు నమోదు అయ్యాయి.

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

11 గంటల పాటు విచారణ

టాలీవుడ్ సినీ హీరో, హీరోయిన్లపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు. 

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

ఈ విచారణలో ఆమె బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని ఒప్పుకున్నారు. 3 యాప్స్‌కు తాను ప్రమోషన్స్ చేశానని విచారణలో చెప్పుకొచ్చారు. దీంతో 25వ తేదీన పోలీసులు మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. విచారణ అనంతరం బయటకొచ్చిన విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

అన్నింటికి సమాధానం

ఈ మేరకు తన ఇన్‌స్టాలో సంచలన పోస్టు పెట్టారు. అందులో ‘‘Only Time Can Answer.. Only Patience Till Then’’ (కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.. అప్పటి వరకు ఓపికతో ఉండాలి) అంటూ ఆ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు కంగుతిన్నారు. 

#telugu-news #latest-telugu-news #vishnu-priya #Betting app case
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు