/rtv/media/media_files/2026/05/05/trisha-2026-05-05-07-07-11.jpg)
Trisha
Trisha: నటి త్రిష కృష్ణన్ Trisha Krishnan నిన్న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సినీ రంగం నుంచి, రాజకీయ వర్గాల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సారి శుభాకాంక్షల్లో ఒక ప్రత్యేక విషయం కనిపిస్తోంది. ఆమె స్నేహితులు చాలా మంది, ఆమెకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ గురించి సరదాగా చెబుతున్నారు.
అది ఏమిటంటే, విజయ్ Vijay తన రాజకీయ ప్రయాణంలో సాధించిన విజయమే ఆమెకు పెద్ద గిఫ్ట్ అని అంటూ విషెస్ చెబుతున్నారు. ఉదయం నిర్మాత బండ్ల గణేష్ Bandla Ganesh పోస్ట్ చేసిన ట్వీట్ లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు, తర్వాత మంచు లక్ష్మీ Manchu Lakshmi కూడా అదే తరహాలో స్పందించింది.
లక్ష్మి తన పోస్టులో, “ఈసారి పుట్టినరోజుకి యూనివర్స్ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది” అని రాసింది. ఆమె స్పష్టంగా చెప్పకపోయినా, విజయ్ సాధించిన భారీ విజయం గురించే మాట్లాడినట్టు అర్థమవుతోంది.
Happy Birthday to the ever gorgeous and graceful @trishtrashers ! 🎂✨ What a day to celebrate! I guess the universe decided to give you the best birthday gift with that massive victory ! 🐯💥 Double celebrations for you today! Have a magical one, darling! 🥂💖…
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 4, 2026
ఇక ఛార్మి Charmme Kaur కూడా ఇదే విధంగా శుభాకాంక్షలు తెలిపింది. “స్పెషల్ డే కి స్పెషల్ సెలబ్రేషన్” అంటూ, ఈ పుట్టినరోజు విజయంతో గుర్తుండిపోతుందని పేర్కొంది. ఆమె కూడా విజయ్ సక్సెస్ గురించి మాట్లాడినట్టే కనిపిస్తోంది.
/rtv/media/post_attachments/edb9945f-cf7.png)
మొత్తానికి, సినిమా రంగంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చాలా మంది ఈ విధంగా త్రిషను అభినందిస్తున్నారు. కొందరు అయితే, త్రిషా కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయొచ్చని అంటున్నారు. అయితే ఈ విషయాలపై త్రిష గానీ, విజయ్ గానీ ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం.
Follow Us