Trisha: నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపులు!
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరో సారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మరో సారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. చెన్నై ఆళ్వార్పేట్ లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్స్ చేసిన హీరోయిన్ త్రిష ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ నెల 6వ తేదీన తమిళంలో 'ది రోడ్' సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది.సంగీత దర్శకుడు సామ్ సీఎస్ నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ వశీగరన్ దర్శకత్వం వహించాడు. మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ కథకు మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతుందని చెపుతున్నారు.అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.