VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే!

విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘VD12’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

New Update
Vijay Deverakonda, Gautham Tinnanuri, Naga Vamsi combo VD 12 movie title fixed

Vijay Deverakonda, Gautham Tinnanuri, Naga Vamsi combo VD 12 movie title fixed

‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ‘VD12’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినీ ప్రేక్షకులు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

ఇప్పుడంతా ఈ సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎవ్వరి అంచనాలకు అందకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఫుల్ హైప్ పెంచేశాడు. 

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

‘విడి12’ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. అందులో విజయ్ దేవరకొండ రగ్గడ్ లుక్‌లో చిన్న హెయిర్‌కట్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. 

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

అదిరిపోయే టైటిల్

తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ‘నేను గౌతమ్‌ని చాలా హింస పెట్టాక, ఫైనల్‌గా వీడీ 12 టైటిల్ లాక్ చేశాం.. త్వరలోనే టైటిల్‌ రివీల్ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ టైటిల్ ఏంటా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే ఆ టైటిల్ అంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. మూవీ యూనిట్ ఏ టైటిల్ ఫిక్స్ చేసిందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు