VD12: రెండు భాగాలుగా 'VD12'..క్లారిటీ ఇచ్చిన నాగవంశీ, రిలీజ్ అప్పుడేనట

విజయ్ దేవరకొండ 'VD12' ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.ఈ ఆలోచన సినిమా షూటింగ్ కి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ ఉంటుందని అన్నారు.

New Update
nagavamsi on vd12 movie

nagavamsi on vd12 movie

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉంది. 'లైగర్' వంటి డిజాస్టర్ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు అంచనాలను అందుకోకపోవడం రౌడీ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నుంచి సాలిడ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కమ్ బ్యాక్ 'VD12' మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ పోస్టర్‌లో విజయ్ షార్ట్ హెయిర్ కట్, గడ్డంతో అగ్రెసివ్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే!

రెండు భాగాలుగా..

సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. 'VD1'2 చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఆలోచన సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే వచ్చిందని, అందువల్ల మొదటి భాగం భాగంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని నాగవంశీ తెలిపారు.

మార్చ్ లో రిలీజ్ ..

ముఖ్యంగా, ఈ రెండు పార్ట్‌ల కథలు పూర్తి భిన్నంగా ఉండబోతాయని, సెకెండ్ పార్ట్ చేసినా, చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం VD12 షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి విడుదల చేయాలని చూస్తున్నట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉంటే తమ సినిమాను వాయిదా వేయాల్సి వస్తామని స్పష్టం చేశారు.

Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు