Perusu: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

‘పెరుసు’ ఓ అడల్ట్ కామెడీ చిత్రం. తండ్రి ఆకస్మిక మృతిని రహస్యంగా ఉంచాలని అనుకున్న కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను హాస్యంగా తెరకెక్కించారు. వైభవ్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

New Update
Perusu

Perusu

వెరైటీ కథలు చూస్తూ అలవాటుపడిన ప్రేక్షకులకు, ఒక్కసారి ‘పెరుసు’ అనే సినిమా చూస్తే, "ఇలాంటి కథ ఎలా వచ్చిందో!" అని ఆశ్చర్యపోవడం ఖాయం. అడల్ట్ హ్యూమర్ జోనర్‌లో ఈ చిత్రం నవ్వులతో పాటు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో నెవిగేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. మార్చి 14న విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో అందుబాటులోకి వచ్చింది.

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

కథ ఏమిటంటే...

పరంధామయ్య అనే పెద్దాయన తన గ్రామంలో ఎంతో గౌరవంతో జీవితం సాగిస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, వారంతా తమ జీవితాల్లో సెటిల్ అయి ఉంటారు. ఒకరోజు పరంధామయ్య టీవీ చూస్తుండగానే అచేతనంగా పడిపోతారు. అయితే, ఆయన మరణాన్ని బయటకు చెప్పలేని ఒక వివాదాస్పద పరిస్థితి కుటుంబాన్ని కుదిపేస్తుంది. ఇది గ్రామంలో పరువుకు భంగం తెస్తుందన్న భయంతో, కుమారులు అతని అంత్యక్రియలు రహస్యంగా చేయాలని నిర్ణయిస్తారు. కానీ, ఆ నిర్ణయంతో సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథలో మిగిలిన భాగం.

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

సినిమా మొత్తం ఓ బోల్డ్ టోన్‌లో సాగినా, అది బలవంతంగా కాకుండా నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమాను కుటుంబంతో చూడాలనుకునే వారు మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే ఎందుకంటే ఇది పూర్తిగా అడల్ట్ కామెడీగా తీర్చిదిద్దబడింది.

ఈ చిత్రంలో హీరోగా వైభవ్ రెడ్డి నటించగా, ఆయన సోదరుడు సునీల్ రెడ్డి కూడా ఇందులో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. వారిద్దరూ ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారులు కావడం గమనార్హం.

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఆఫీషియల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం, అడల్ట్ హ్యూమర్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఇది కుటుంబ ప్రేక్షకులకు అనుకూలంగా ఉండదని చెప్పవచ్చు. వెరైటీ జోనర్, బోల్డ్ కథాంశం, అచ్చమైన కామెడీ  ఈ మూడూ కలిస్తే  ‘పెరుసు’.

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment