/rtv/media/media_files/2026/04/07/trisha-2026-04-07-16-28-01.jpg)
Trisha Breaks Silence On movies Retirement Rumors
టీవీకే అధినేత విజయ్, నటి త్రిష రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిత్రా లక్ష్మణన్ అనే నటుడు ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ త్రిష సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలో దీనిపై స్పందించారు. '' అవును నేను సినిమాలు మానేశాను. ఓ పెద్ద వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాను. ఇది మీ ఊహాగానాలకు సరిపోతుందా ?. మీకు వార్తలు రాసుకునేందుకు ఇది చాలా ఇంకే ఏమైనా చెప్పాలా'' అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.
Also Read: పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టం.. తొలి 'క్వీర్' ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణస్వీకారం
త్రిష ఈ కామెంట్స్ చేయడంతో ఆమె సినిమాలు చేయడం మానేయనున్నారన్న వార్తలకు చెక్ పడింది. అయితే ఓ యూట్యూబ్ వేదికగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిత్రా లక్ష్మణన్ మాట్లాడారు. త్రిష ఇకనుంచి సినిమాల్లో చేయాలని అనుకోవడం లేదని.. వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదని తెలిపారు.
Also Read: పో*ర్న్ సైట్‌లో నా ఫొటో పెట్టారు.. జాన్వీ కపూర్ ఎమోషనల్
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రిష రాజకీయాలపై ఫోకస్ పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. విజయ్‌కి, ఆమెకి రిలేషన్ అల్లుతూ మరిన్ని ఊహాగాణాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీటన్నింటికీ చెక్ పెడుతూ త్రిష తనదైన స్టైల్‌లో స్పందించారు. ప్రస్తుతం ఆమె సూర్య నటిస్తున్న కరుప్పు (తెలుగులో వీరభద్రుడు), అలాగే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
Follow Us