/rtv/media/media_files/2025/04/02/UDa38dsPyDpiBlUKXmvl.jpg)
Transgender Sneha Interesting Conversation With RGV At Saree Movie Promotions video viral
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సారి వింత టైటిల్ ‘శారీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని RGV ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ నిర్మించారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో ఆరాధ్య దేవీ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్‌కు రెండు మూడు రోజులే ఉండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ట్రాన్స్‌జెండర్‌తో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
వర్మ చేతిలో పడ్డాను
వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ.. నా లుక్ ఎలా ఉందో చెప్పండి అని రామ్ గోపాల్ వర్మను ఆ ట్రాన్స్‌జెండర్ స్నేహ అడిగింది. దానికి రిప్లై ఇచ్చిన ఆర్జీవీ.. ఇప్పుడంతా శారీ మూడ్‌లో ఉన్నాం.. అందువల్ల మీరు చాలా బాగున్నారు అని అన్నాడు. ఆపై లవ్యూ సర్.. మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా అంటూ ఆర్జీవీని స్నేహా హగ్ చేసుకుంది.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
అక్కడితో వీరిద్దరి సంభాషణ ఆగలేదు. ముందుగా మీరంటే అస్సలు నచ్చదు సర్ అని స్నేహా తెలిపింది. కానీ మీరు నాకు బాగా నచ్చారు అంటూ వెంటనే ఆర్జీవీ ఆన్సర్ ఇచ్చేశాడు. అంతేకాకుండా స్నేహా మాట్లాడుతూ.. తాను ఆర్జీవీ మీదకి కోపంతో వచ్చానని.. అతడు ఎంతసేపు అమ్మాయిలనే పొగుడుతూ ఉంటారని తెలిపింది.
అమ్మాయిల బాడీ, స్ట్రక్చర్ గురించే ఆర్జీవీ చెబుతుంటాడని.. అవి వింటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా తనకు కోపం వస్తుందని ఆ వీడియోలో మాట్లాడింది. అనంతరం ట్రాన్స్‌జెండర్ల మీద ఏమైనా మూవీ తీస్తారా? అని అడగ్గా.. ఏమో ఎప్పుడైనా తీయొచ్చేమో అంటూ ఆర్జీవీ చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.