/rtv/media/media_files/2025/02/08/RiP55gLd5si1ZEtV0EL8.jpg)
rgv another Controversial tweet Photograph: (rgv another Controversial tweet)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెడకు వరుస ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. వ్యూహం మూవీ రిలీజ్ టైంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో అతడిపై ఒంగోలులోని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Also Read: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
ఈ కేసుకు సంబంధించి నిన్న రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు వెళ్లారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ముందుగానే ఆదేశించింది. దీంతో నిన్న ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు.
వివాదాస్పద ట్వీట్
ఆ విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మ తన డెన్‌కి వచ్చారు. తాజాగా తన ఎక్స్‌లో మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్‌లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు 3 ఛీర్స్ అంటూ పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇక 9 గంటల విచారణ తర్వాత వచ్చి.. మందు తాగుతున్న ఫోటోలను ఆర్జీవీ తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
I LOVE ONGOLE 😍 AND I LOVE ONGOLE POLICE EVEN MORE😍😍. 3 CHEEERS 🍺🍺🍺 pic.twitter.com/vmjNW7ALdL
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2025
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
ఆర్జీవీపై మరో కేసు
ఆర్జీవీపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అతడ్ని నిన్న పోలీసులు విచారిస్తున్న సమయంలోనే మరో కేసు విషయంలో ఏపీ సీఐడీ నుంచి ఆర్జీవీకి నోటీసులు వెళ్లాయి. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు.
2019లో ఆర్జీవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను తీశారు. కొందరు మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా తీశారని గతేడాది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో ఆర్జీవీ విచారణకు వెళ్తాడో లేదో చూడాలి.