/rtv/media/media_files/2025/02/24/0dj77gOh4fgNcKDXXsxA.jpg)
tollywood actress priya bhavani shankar talk about chance to act in Allu Arjun with romantic scenes
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఓకే అంటే అతడితో సినిమా చేయడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఎందరో హీరోయిన్లు బన్నీ సరసన నటించాలని కోరుకుంటున్నారు. లైఫ్‌లో ఒక్కసారి అయినా అతడితో నటించాలని అనుకుంటున్నారు. ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ఎప్పుడెప్పుడు బన్నీ సరసన నటిస్తామా? అని.
అలాంటి కోరికే తనకు ఉందని తాజాగా ఓ నటి తన మనసులోని మాట బయటపెట్టింది. కోలీవుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాలతో దూసుకుపోతున్న నటి ప్రియా భవానీ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
అల్లు అర్జున్ అంటే పిచ్చి
అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టం అని.. అతనంటే పిచ్చి అని ఇంటర్వ్యూలో పేర్కొంది. అంతేకాదండోయ్ బన్నీతో రొమాంటిక్ సీన్లలో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇదంతా ఆమె ‘కళ్యాణం కమనీయం’ మూవీ ప్రమోషన్స్‌లో ప్రియా భవానీ మాట్లాడిన మాటలు. దీంతో ఇప్పుడీ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఇక ఈ అందాల ముద్దుగుమ్మ సినీ కెరీర్ విషయానికొస్తే.. కళ్యాణం కమనీయం అనే సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ తర్వాత గోపీచంద్‌తో భీమా, సత్యదేశ్‌తో జీబ్రా వంటి సినిమాలు చేసింది. మరోవైపు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఇండియన్ 3 లో నటిస్తోంది.