/rtv/media/media_files/2026/04/26/fotojet-5-2026-04-26-11-51-36.jpg)
Rakasa
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం 'రాకాస'. హారర్ ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.27 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. 'రాకాస' చిత్రం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చూడండి: Iran leadership crisis : ఇరాన్ నాయకత్వంలో చీలిక... సైన్యం వర్సెస్ రాజకీయ వర్గం
Finally : Rakasa ~ HD DATE 🔐🔥!!
— Տri Bobby (@Bobby__Sri) April 26, 2026
Streaming From : May 1st ⚡
Digital Platform : Netflix 🍿
Audio 🔊 : Tamil, Telugu, Mal, Kan, Hin pic.twitter.com/bRirLhCWRV
ఇది కూడా చూడండి: Murder : అమెరికాలో పరిశోధనా విద్యార్థుల హత్య! స్నేహితుడే హంతకుడు..
సినిమా స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా కథ వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్) చుట్టూ తిరుగుతుంది. తను ప్రేమించిన అమ్మాయి పెళ్లిని ఆపడానికి అమెరికా నుండి వచ్చిన వీరూ, ఆ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరి సమీపంలో ఒక పాత కోట ఉంటుంది. ఆ కోటలో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని, అది సమయం వచ్చినప్పుడు నరబలి కోరుతుందని ఆ ఊరి జనం నమ్ముతుంటారు. అనుకోని పరిస్థితుల్లో వీరూ ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ కోట రహస్యం ఏమిటి? వీరూ అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనేదే సినిమా స్టోరీ.
ఇది కూడా చూడండి: Washington Hilton Hotel : నాడు రొనాల్డ్, నేడు డొనాల్డ్...,అదే హోటల్..45 సంవత్సరాల తర్వాత సీన్ రిపీట్
ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించగా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించారు. సినిమాలో తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషించారు. హారర్ ఫాంటసీ జోనర్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతి అని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Donald Trump : వైట్ హౌజ్ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో కేఏ పాల్
Follow Us