Sukumar: సుకుమార్ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రెండో రోజు కూడా

'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మైత్రీ మేకర్స్ సంస్థలో, యజమానులు ఇళ్లల్లో మూడో రోజు రైడ్స్ జరుగుతున్నాయి. అలాగే దిల్ రాజ్ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.

New Update
sukumar it raids

sukumar it raids

Sukumar: ' స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని సుకుమార్ మొదలైన తనిఖీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 'పుష్ప 2'  భారీ కలెక్షన్ల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్ కి కూడా షేర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో, ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో మూడు రోజు సోదాలు కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడి సూత్రధారి మృతి

సినిమాల కలెక్షన్ల పై ఆరా 

పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై  లెక్కలు అడుగుతున్నారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతోనే ఈ సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు.. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై లపై దిల్ రాజును  ఆరా తీస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు చేస్తున్నారు. 

ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజు (Dil Raju) ను తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిన్న కూడా సాయంత్రం వరకూ ఫుల్ తనిఖీలు చేశారు. దిల్‌ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్‌ ఉజాస్‌ విల్లాస్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి.., శిరీష్‌ ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌లతో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Also Read: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Divi: నాజూకు నడుము అందాలతో బిగ్ బాస్ బ్యూటీ హొయలు.. ఫొటోలు చూశారా?

బిగ్ బాస్ బ్యూటీ దివి మరో సారి తన ఆకర్షణీయమైన శైలితో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా స్టైలిష్ లెహంగాలో దివి ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment