Taapsee Pannu : హిందీలో అది.. సౌత్‌లో ఇది.. ఇండస్ట్రీ గుట్టు విప్పిన తాప్సీ!

ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్నూ భారతీయ సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తున్న విధానంపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన 'అస్సీ' సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ

New Update
tapsee

ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్నూ(Taapsee Pannu) భారతీయ సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తున్న విధానంపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన 'అస్సీ' సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో చోట ఒక్కోలా హీరోయిన్ల శరీర భాగాలను హైలైట్ చేస్తారని చెప్పారు. ముఖ్యంగా హిందీ సినిమా(bollywood) ల్లో క్లీవేజ్ (ఎద భాగం) చూపిస్తే, సౌత్ సినిమాల్లో మాత్రం నాభి (బొడ్డు) పైన ఎక్కువ ఫోకస్ పెడతారని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read :  ఆ మాటలకు మూడు రోజులు నిద్రపోలేదు : శివాజీ

ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని

తన కెరీర్ మొదట్లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలను కూడా తాప్సీ బయటపెట్టారు. కొన్ని పాటల షూటింగ్ సమయంలో తనను ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని పరోక్షంగా ఒత్తిడి చేసేవారని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని దర్శకులు నేరుగా చెప్పకుండా వారి అసిస్టెంట్ల ద్వారా చెప్పించేవారని, అది తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అందం కోసం హీరోయిన్లపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read :  తలైవాతో లోకనాయకుడు.. అనౌన్స్మెంట్ వీడియో అదిరిందిగా!

Advertisment
తాజా కథనాలు