/rtv/media/media_files/2025/11/06/jana-nayagan-2025-11-06-17-45-46.jpg)
jana nayagan
రాజకీయాల్లోకి దిగ ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ సినిమా విషయంలో విజయ్ ఎప్పుడూ లేని ఇబ్బందులను ఎుర్కొంటున్నారు. అసలు మూవీ విడుదలే అవకుండా వాయిదాలు పడుతోంది. పైగా విడుదల విషయంలో వివాదం కూడా తలెత్తింది. సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ క్లియరెన్స్‌పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈనెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను సుప్రీం కోర్టు సూచించింది.
అసలేంటీ వివాదం..
తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీలోని కోర్ పాయింట్ ను తీసుకుని, విజయ్ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా స్క్రిప్ట్ ను మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ, సామాజిక, కులపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో యాడ్ చేశారని చెబతున్నారు. దాంతో సెన్సార్ బృందం కొన్ని సన్నివేశాలను తొలగించడం, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయమని కోరుతూ యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. 'జన నాయగన్' మేకర్స్ దీనికి అంగీకరించి, తుది కాపీని సి.బి.ఎఫ్.సి.కి సబ్మిట్ చేశారు. అయినా కూడా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదని, చివరి నిమిషంలో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రికమండ్ చేస్తున్నామని సి.బి.ఎఫ్.సి. అధికారులు చెబుతున్నారని మేకర్స్ ఆరోపించారు. ఈ విషయమై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ జన నాయగన్ నిర్మాతలు సుప్రీంకోర్టు కు వెళ్ళారు. కానీ అక్కడ కూడా చుక్కెదురు అయింది.
Also Read: Iran: అణ్వాయుధాలను దాచిన ఇరాన్..ఆ ధైర్యంతోనే అమెరికాకు సవాల్
Follow Us