/rtv/media/media_files/2025/01/18/i3F3uX8NXS05y6nhkoqu.jpg)
mohan babu
జర్నలిస్టుపై దాడి కేసులో టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో మోహన్ బాబు (Mohan Babu) కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 డిసెంబరు 10వ తేదీన జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదయింది. ముందుగా ఈ ఘటనలో మోహన్ బాబుపై బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత లీగల్ ఒపీనియన్ తీసుకుని 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి హత్యాయత్నం కేసుగా మార్చారు.
Also read : బిగ్ షాక్.. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. ఎక్కడో తెలుసా!
Also Read : ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం
హైకోర్టు రిజెక్ట్
అయితే మోహన్ బాబు తనపై నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ 2024 డిసెంబరు 23న హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా గాయపడిన జర్నలిస్టుకు మోహన్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా రిలీజ్ చేశారు. జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం తనకు బాధ కలిగించిందన్న మోహన్ బాబు.. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ రోజు తన ఇంటిగేటు విగిరిపోయిందని దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని తెలిపారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లుగా లేఖలో వివరించారు.
Also read : ముంబై ట్విన్ టన్నెల్స్ లో ఫ్రాడ్...మేఘా ఇంజనీరింగ్ మీద హైకోర్టులో పిటిషన్
Also Read : బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?