Sukumar : సినిమాలు వదిలేస్తా.. సుకుమార్ సంచలన ప్రకటన

డైరెక్టర్ సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన ఆయన.. ఈవెంట్ లో 'మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని అన్నారు.

New Update
sukumar statement on movies

sukumar statement on movies

'పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. 

Also Read: డాకు మహారాజ్' నుంచి చిన్ని సాంగ్ వచ్చేసింది..!

ఇవన్నీ అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపించాయనేది తెలియదు, కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం వీటి వల్ల  మానసికంగా కృంగిపోయాడని అర్థమవుతుంది. రేసెంట్ గా ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌లో, మహిళ మృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు.

Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే 

సుకుమార్ సంచలన ప్రకటన..

యూఎస్‌లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ సుకుమార్ ను..' మీరు ఒకవేళ 'ధోప్' ' (వదిలిపెట్టడం అని అర్థం) అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని అడిగితే.. సుక్కు ఏకంగా 'సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా' అని చెప్పాడు. 

దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని 'అలా చేయరులే'  అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల మీడియా అంతటా వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్స్..' ప్రెజెంట్ సిచ్యుయేషన్ వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయ్యి ఇలాంటి కామెంట్ చేసినట్లు ఉన్నాడంటూ అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు