Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్‌ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే?

డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

New Update
Sharukh-Sukumar

Sharukh-Sukumar Photograph: (Sharukh-Sukumar)

పుష్ప మూవీతో సుకుమార్ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. సుకుమార్ కోసం స్టార్ హీరోలంతా కూడా లైన్ కడుతున్నారు. అయితే ప్రస్తుతం సుకుమార్ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సినిమా కోసం సుకుమార్ ముంబైకి కూడా వెళ్లినట్లు..

సౌత్ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఖాన్ గతంలో కలిసి పనిచేశాడు. జవాన్ మూవీ తీయగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మళ్లీ సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ ముంబైకి కూడా వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోలు కూడా బయటకు రాలేదు.

ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

ప్రస్తుతం సుకుమార్ హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బదులుగా తెలుగు చిత్రాలను తెరకెక్కించి వాటిని పాన్-ఇండియన్ స్థాయిలో విడుదల చేయడానికి సుక్కూ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 2023లో, షారుఖ్ ఖాన్ చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ విడుదలయ్యాయి. 2024లో అతని సినిమాలు ఏవీ విడుదల కాలేదు. 

ఇది కూడా చూడండి:  Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ఇప్పుడు కొత్త సినిమాలు ఏవి కూడా అంగీకరించలేనట్లు తెలుస్తోంది. కొత్త సినిమాల గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి త్వరలో వీటిపై ఎలాంటి అధికార ప్రకటన చేస్తారో చూడాలి.

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tejaswi Madivada: బికినీలో తేజశ్వి గ్లామర్ షో.. ఫొటోలు చూస్తే అంతే!

యంగ్ బ్యూటీ తేజశ్విని రెడ్ బికినీలో గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వందలాది లైక్‌లు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.

New Update
Advertisment
Advertisment
Advertisment