/rtv/media/media_files/2024/12/22/NrnaLrl5wkrjLvNExOhK.jpg)
ram charan sukumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 10 న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.
రిలీజ్ దగ్గర పడటంతో నిన్న యూ ఎస్ లోని డల్లాస్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న దర్శకుడు సుకుమార్.. సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని, ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అన్నారు.
First Review of #GameChanger from the Man of the Moment, Genius Sukumar🔥 Himself!#GameChanger a Sure Shot Blockbuster💥
— Mr.RK (@RavikumarJSP) December 22, 2024
Jan 10, 2025 ❤️🔥
BOSS OF GANGSTERS @AlwaysRamCharan 🦁🥵🔥 pic.twitter.com/WLMGTSkKli
ఇది కూడా చదవండి: అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో
" చిరంజీవిగారితో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూశా. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గగుర్పాట కలుగుతుంది.
శంకర్‌గారి సినిమాలు ‘జెంటిల్‌మెన్’, ‘భారతీయుడు’ చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంతలా ఈ మూవీని కూడా ఆస్వాదించా. ‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం.
నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..
ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చాలా బాగా చేశాడు. ఈ నటనకు ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా.." అని చెప్పుకొచ్చారు. దీంతో సుకుమార్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.