Sri reddy: చాలా చాలా అలసిపోయా.. ఇక ఓపిక లేదు: శ్రీ రెడ్డి మరో సంచలన పోస్ట్!

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి మరో సంచలన పోస్ట్ పెట్టింది. 'చాలా చాలా అలసిపోయా. ఇక ఓపిక నశించింది. ఇండస్ట్రీలో ఏ మార్పు రాదు. నాలాగా మీ జావితం పాడు చేసుకోవద్దు. లవ్ యూ ఆల్' అంటూ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

New Update
sri reddy

Sri Reddy another sensational post

Sri reddy: బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. తన జీవితం నాశనం అయిపోయిందంటూ ఎమోషనల్ అయింది. చాలా మందిని నమ్మి మోసపోయానని, ఎవరు తనలాగా కావొద్దంటూ తన అభిమానులకు సూచించింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీతోపాటు పోలిటికల్ గా కూడా ఇండైరెక్ట్ సెటైర్స్ వేసింది.

వేస్ట్ ఒకే నా?

'నా జీవితం రోజు పోరాటమే అయిపోయింది. చాలా చాలా అలసిపోయా. ఇక ఓపిక నశించింది. నా ఒక్కదానివల్ల ఈ ఇండస్ట్రీలో ఏ మార్పు రాదు. ఒక మూసలో ఉన్నవి. కొత్తగా వచ్చి మనం ఎవరం మార్చలేము. నా లాగా ఎదురించి ఎవరు మీ పేరు, జీవితం పాడుచేసుకోవద్దు. ఎవరిలో ఏ మార్పు రాదు. వేస్ట్ ఒకే నా? నా అనుకున్న వాళ్లు కూడా ఎవరినో స్ర్కాప్ ను ఎంకరేజ్ చేస్తారు. మనల్ని పక్కన పడేస్తారు. నా జీవితం మీ అందరికీ ఒక మంచి పాఠం. లవ్ యూ ఆల్' అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

'నువ్వు తాగి మెసేజ్ చేసినట్టు ఉన్నావ్ శ్రీ రెడ్డి' ఒకరు. 'ఇంకా అరెస్ట్ చెయ్య లేదా? పాపం పోసాని కన్నా దారుణంగా తిట్టింది కదా మిమ్మల్ని. ఎంటో తెర వెనక మతలబు' అంటూ సెటైర్స్ వేస్తున్నారు. 'అనరాని మాటలు అంటివి, చేయరాని పనులు చేస్తివి. ఒకే కులం అయినా అన్యాయం చేసాడా!!? యడ్డి మాటలు మాట్లాడితె నడ్డి విరగటం తప్ప ఏమిరాదు శ్రీరెడ్డి!? పెళ్ళి చేసుకుని బుద్ధిగా సంసారం చేసుకోపో' అని సూచిస్తున్నారు. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

sri-reddy | post | viral | vijayawada | telugu-news 

#telugu-news #vijayawada #viral #post #sri-reddy
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Shine Tom Chacko షైన్ పై మరో నటి సంచలనం.. సెట్ లో ...

Shine Tom Chacko షైన్ పై మరో నటి సంచలనం.. సెట్ లో లైంగికంగా..

నటుడు షైన్ టామ్ చాకో పై మరో నటి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న అపర్ణ అక్కడి మీడియాతో మాటాడుతూ.. షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. లైంగికంగా ప్రేరేపించే విధంగా ఆయన మాటలు ఉండేవని ఆరోపించింది.

New Update
actress Aparna allegations on Shine Tom Chacko

actress Aparna allegations on Shine Tom Chacko

Shine Tom Chacko మలయాళ నటి విన్సీ తర్వాత మరి నటి  షైన్ టామ్ చాకో పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 'సూత్రవ్యాక్యం' సినిమా షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి అపర్ణ జోన్స్  మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ షైన్ పై సంచలన ఆరోపణలు చేసింది. షైన్ తనతో చాలా చెడుగా ప్రవర్తించేవాడని, లైంగికంగా ప్రేరేపించే విధంగా మాట్లాడేవాడిని ఆరోపించింది. దీని గురించి అక్కడ సిబ్బందితో కూడా చెప్పానని  పేర్కొంది. 

100 శాతం నిజాలు.. నటి అపర్ణ 

నటి అపర్ణ జోనస్ ఇంకా మాట్లాడుతూ.. అతడి గురించి విన్సీ పంచుకున్న అనుభవాలు 100 శాతం నిజాలు. సెట్లో నేను అతడితో కూర్చొని ఉన్నప్పుడు షైన్ నోట్లో ఏదో తెల్లటి పదార్థం ఉమ్మేసేవాడు. ఆధారాలు లేకుండా నేను దానిని డ్రగ్స్ అని చెప్పలేను.. అది గ్లూకోజ్ కూడా అయి ఉండొచ్చు. కానీ అతడి ప్రవర్తన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సెట్ లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు.. అనవసరమైన మాటలు మాట్లాడేవారు. పరిసరాల్లో అమ్మాయిలు ఉంటే తన మాటలు మరింత అసభ్యకరంగా ఉండేవి. తన ప్రవర్తన నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందితో నా అసౌకర్యం గురించి చెప్పాను. దీంతో చిత్రబృందం అతడి కంటే ముందు నా షెడ్యూల్ పూర్తి చేసి పంపించారు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల చట్టపరమైన చర్యల్లో పాల్గొనలేకపోతున్నాను. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లేదానిని అని తెలిపింది నటి అపర్ణ జోన్స్

latest-news | cinema-news | actor-shine-tom-chacko

Advertisment
Advertisment
Advertisment