Shilpa Ravi: పవన్‌పై శిల్పా రవి సెటైర్.. అల్లు అర్జున్‌ను ఇష్యూ బయటకు లాగిన జనసైనికులు!

కడపలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని ఇటీవల కూల్చివేశారు. దీనిపై శిల్పా రవి స్పందిస్తూ ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు ఫైరవుతున్నారు.

New Update
shilpa ravi Satirical tweet on Pawan Kalyan Sanatana Dharma

shilpa ravi Satirical tweet on Pawan Kalyan Sanatana Dharma

ఏపీలోని కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇందులోని అన్నదాన సత్రంలో ప్రతీరోజూ వందలమంది పేదలు, బాటసారులు, యాత్రికులు ఆకలి తీర్చుకునే వారు. అలాంటి అన్నదాన సత్రాన్ని ఇటీవల అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. దీంతో ఎంతో మంది ఆకలిని తీర్చే అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంపై హిందువులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

ఈ తరుణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ పోస్టు చేయగా.. దానిపై నెటిజన్లు, జనసేనా పార్టీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

శిల్పా రవి పోస్టు వైరల్

శిల్పా రవి పోస్టు చేస్తూ.. ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ అందులో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు, జనసైనికులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అందులో ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నీ మిత్రుడు జైల్లో ఉంటే స్పందించవా..? సొంత మేనమామకి అల్లుడికి గొడవ పెట్టి..! ఏం సాదించవ్.. మళ్లీ నంద్యాలలో గెలిచే సత్తా ఉందా..!.. మీ కన్వర్టెడ్ రెడ్డి టైంలో గుడులు, కన్వర్షన్ ఎక్కువ అయ్యాయి. ఏం చేసావ్..! కాశి రెడ్డి మీ కులం అని మాట్లాడుతున్నావా..?’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ నెటిజన్ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. శిల్పా రవి పోస్టుపై చాలా మంది ఇదే విధమైన కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

ఇదిలా ఉంటే కాశినాయన ఆశ్రమంలో అన్నదాన సత్రం కూల్చివేతలపై ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు చెప్పారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని అన్నారు. అన్నదాన సత్రాన్ని కూల్చకుండా ఉండాల్సింది అని అభిప్రాయపడ్డాడు. త్వరలో తన సొంత డబ్బులతో ఆ సత్రాన్ని పునర్నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు