Saif Ali khan: సైఫ్ అలీఖాన్ పై దాడి బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. దాడికి పాల్పడిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి బాంద్రా పోలీస్ స్టేషన్ లో కష్టడీలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
300 మంది పోలీసులు
అయితే నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించినట్లు సమాచారం. ఈ గాలింపు చర్యలో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారట. ఈ క్రమంలో దాడి తర్వాత నిందితుడు అంధేరి ప్రాంతంలో మోటార్ బైక్ పై ప్రయాణించడం గుర్తించిన పోలీసులు.. బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెట్టి ఆ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. నిందితుడితో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో నలుగురు వ్యక్తుల గురించి నుంచి కూడా సమాచారం సేకరించారు.
Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్
పట్టించిన యూపీఐ పేమెంట్..!
ఇలా నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిందితుడు మహ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని.. దానికోసం అతడు యూపీఐ పేమెంట్ చేశాడని ఓ వ్యక్తి తెలిపాడట. దీని ద్వారా నిందితుడి నెంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రాక్ చేశారని.. ఆవిధంగా అతడు ఠానేలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. పోలీసులను చూసి నిందితుడు పారిపోవాలని ప్రయత్నించగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ కీలక నిర్ణయం!
నిందితుడి బ్యాగ్‌లో..
పోలీసుల విచారణలో నిందితుడి బ్యాగు నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్, నైలాన్ తాడుతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బ్యాగ్‌లో ఇలాంటివి కనిపించడంతో అతడికి నేరచరిత్ర ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడికి తాను దాడి చేసింది సైఫ్ అలీఖాన్ పై అని తెలియదని అధికారులు చెబుతున్నారు. టీవీ, సోషల్ మీడియా పోస్ట్‌లలో వచ్చిన వార్తలు చూసిన తర్వాతే తాను దాడి చేసింది సైఫ్ అలీఖాన్ పై అని నిందితుడికి తెలిసినట్లు సమాచారం.
Also Read: Kannappa: మంచు విష్ణు కన్నప్ప నుంచి మరో కొత్త పోస్టర్.. పరమశివుడి అవతారంలో బాలీవుడ్ హీరో!