Robinhood: ఇది వేరే లెవెల్.. నితిన్ 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్ కి డేవిడ్ వార్నర్

నితిన్ 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్ వేడుకకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూవీ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్నర్ ఈ సినిమాలో గెస్టుగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

New Update

Robinhood:  వెంకీ కుడుములు దర్శకత్వంలో హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్‌'. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి పాటలు, టీజర్ విడుదల చేయగా.. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

ప్రీ రిలీజ్ వేడుకకు డేవిడ్ వార్నర్ 

అయితే 'రాబిన్‌హుడ్‌' సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ ఎంట్రీ ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రీ రిలీజ్ వేడుకకు డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూవీ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు