Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియకు బదులు విచారణకు వెళ్లిన శేఖర్ భాషా!

బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీతేజ గైర్హాజరయ్యారు. వాళ్లిద్దరి తరఫున RJ శేఖర్ భాష వెళ్లి 3రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించారు. కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు తెలిపాడు.

New Update
RJ Shekar Basha appears in Inquiry instead of anchor Vishnu Priya and Tasty Teja in betting app case

RJ Shekar Basha appears in Inquiry instead of anchor Vishnu Priya and Tasty Teja in betting app case

బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్ పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ, టేస్టీ తేజలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో 4 గంటలకు పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరు అయ్యారు. వాళ్లిద్దరి తరఫున పంజాగుట్ట పీఎస్‌కు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్, RJ శేఖర్ భాష వెళ్లాడు. అంతేకాకుండా శేఖర్ భాష వాళ్లిద్దరి కోసం సమయం కోరినట్లు తెలిసింది. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

3 రోజుల సమయం

దాదాపు 3 రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే విచారణకు విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరు కావడానికి గల కారణాన్ని శేఖర్ భాష వివరించాడు. ఈ కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు వివరించాడు. పోలీసులు ఇచ్చిన గడువులోగా కచ్చితంగా వచ్చి విచారణకు హాజరవుతారని శేఖర్ భాషా హామీ ఇచ్చాడు. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

బెట్టింగ్ యాప్ లను తెలిసి ప్రమోట్ చేసినా, తెలియక ప్రమోట్ చేసినా తప్పేనని అతడు పేర్కొన్నాడు. ఇదే అంశం గురించి తమ బిగ్ బాస్ గ్రూప్‌లో కూడా చాలా పెద్ద చర్చ జరిగిందని శేఖర్ భాష చెప్పుకొచ్చాడు. ఆ చర్చల తర్వాత వారితో మాట్లాడి, వాళ్ళ తరఫున తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చానని అతడు తెలిపాడు. దీంతో త్వరలో విష్ణు ప్రియ, టేస్టీ తేజ పంజాగుట్ట పీఎస్ పరిధిలో హాజరు కానున్నట్లు అర్థం అవుతోంది. 

Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

నోటీసులు

ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో11మందిపై కేసు నమోదు అవ్వగా.. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు అయిన విష్ణుప్రియ, టేస్టీతేజకు తాజాగా పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని సమాచారం. పరారీలో ఉన్న వారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Advertisment
Advertisment
Advertisment