/rtv/media/media_files/2025/03/05/aA5O6ci0Ir85w5S1mbdg.jpg)
Ravi Teja's Mass Jathara
Ravi Teja's Mass Jathara: టాలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజా రవితేజ. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు ఉన్న రవితేజ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అతి తక్కువ టైం లో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడం రవితేజ స్టైల్. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకొని సినిమాలను చేస్తుంటారు రవితేజ అయితే ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా "మాస్ జాతర" సినిమా నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
రవితేజ హీరోగా నటిస్తున్న "మాస్ జాతర" సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా, వింటేజ్ రవితేజ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, ఈ సినిమా గురించి ఒక క్రేజీ బజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న భీమ్స్ రవితేజ ఓల్డ్ మూవీలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ను "మాస్ జాతర" కోసం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ రీమిక్స్..!
భీమ్స్ రవితేజతో కలిసి గతంలో ధమాకా, రావణాసుర వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ కి పని చేసారు. ఇక ఇప్పుడు, "మాస్ జాతర" సినిమాతో మరో సారి రవితేజ కెరీర్ లో బెస్ట్ మాస్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారు. అయితే అందుకోసం రవితేజ మూవీస్ లో సూపర్ హిట్ గా నిలిచిన "ఇడియట్" సినిమా నుండి ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అప్పట్లో ఈ పాట యూత్ ను ఒక ఊపు ఊపింది, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Also Read: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?