/rtv/media/media_files/2025/02/12/ZIp1ib8Wa3KaV3TNwUbb.jpg)
ALLU ARJUN RAM CHARAN
Mega Vs Allu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి అల్లు- మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ విబేధాలు బయటపడ్డాయి. మెగా హీరో రామ్ చరణ్ ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ని అన్‌ఫాలో చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో రామ్ చరణ్ కలవకపోవడం, కనీసం స్పందించకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలను మరింత స్ట్రాంగ్ చేసింది. ఇండస్ట్రీ మొత్తం బన్నీని పరామర్శించడానికి వెళ్లినా.. రామ్ చరణ్ కనీసం స్పదించలేదు. అంతేకాదు 'పుష్ప2' విజయంపై కూడా బన్నీకి సంబంధించి రామ్ చరణ్, మిగతా మెగా హీరోలు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలతో మొదలైన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది అనుకుంటున్నారు.
Also Read: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!
ఫ్యాన్ వార్
మరో వైపు సోషల్ మీడియాలోనూ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ జరుగుతోంది. 'గేమ్ ఛేంజర్' సినిమాపై అల్లు ఫ్యాన్స్ కుట్ర చేశారని.. టార్గెట్ చేసి సినిమాను ప్లాప్ చేశారని అల్లు ఫ్యాన్స్ పై రెచ్చిపోయారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు ఫ్యాన్స్.. ఇలా ఒకరి పై ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకుంటున్నారు.
Also Read: Divya Pillai: సాయిపల్లవికి అక్కగా నటించిన ఈ తండేల్ బ్యూటీ ఎవరో తెలుసా?