Peddi First Shot: రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ 'పెద్ది' రిలీజ్ కి ముందే రికార్డుల వేట షురూ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ షాట్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 36. 5 మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు యష్ 'టాక్సిక్' గ్లిమ్ప్స్ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read: This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?
Records are meant to be broken. #PeddiFirstShot surpasses #Toxic glimpse views in 24 hours.
— BA Raju's Team (@baraju_SuperHit) April 7, 2025
Massive 36.5 Million+ views in just 24 hours, a historic start to what’s clearly going to be a blockbuster. pic.twitter.com/aHnmCLqK1b
పవర్ ఫుల్ లుక్స్
'పెద్ది' నుంచి చరణ్ ఫస్ట్ షాట్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించింది. ఇందులో చరణ్ గల్లీ క్రికెటర్ గా కనిపించబోతున్నారు. చేతిలో క్రికెట్ బ్యాట్, నోట్లో సిగార్, పవర్ ఫుల్ లుక్స్ తో ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించింది చరణ్ ఇంట్రో షాట్. వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కథానాయికగా నటిస్తోంది.
telugu-news | latest-news | cinema-news | ramcharan
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!