/rtv/media/media_files/2025/01/16/TIttAILkZVgUgTMvDh0Q.jpg)
jagapathi babu rc16
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు.. తాజాగా సెట్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!
జగపతి బాబు లుక్ వీడియో..
జగపతిబాబు మూవీలో తన రోల్ కోసం ఏ విధంగా సిద్దమవుతున్నారో తెలియజేస్తూ వీడియోను షేర్ చేశారు. కానీ లుక్ మాత్రం పూర్తిగా చూపించలేదు. జగపతి బాబు ఈ వీడియోను షేర్ చేస్తూ.. ''చాలా కాలం తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు RC16 కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా అనిపించిందని తెలిపారు''. ఇందులో జగపతి బాబు మేకప్ వేసుకుంటూ కనిపించారు.
Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp
— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమా విజయం రామ్ చరణ్ కి కీలకంగా ఉండబోతుంది.
Also Read: Keerthy Suresh: భర్తతో కీర్తి సురేష్ తొలి సంక్రాంతి వేడుకలు.. ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉన్నారో!