రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్‌లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్కు వేరే రేంజ్‌లో ఉంది.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
కిర్రాక్ లుక్కు
అతడి ఎంట్రీ సీన్ కెవ్ కేక అనే చెప్పాలి. ఈ వీడియోతో మూవీ ఏ జానర్‌లో వస్తుందో అర్థం అయిపోయింది. మొత్తంగా అందరూ అనుకున్నట్లుగానే ఈ పెద్ది చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చరణ్ బ్యాట్ పట్టిన బలమైన క్రికెటర్‌గా కనిపించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో చరణ్ బ్యాట్‌తో బాల్ కొట్టిన తీరు సరికొత్తగా ఉంది.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరిపోయింది. మొత్తంగా ఈ వీడియోతో పెద్ది సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదే వీడియోలో మేకర్స్ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 27న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
(Short News | Latest News In Telugu peddi | Ram Charan | latest-telugu-news | telugu-news)