మ‌హేశ్, రాజ‌మౌళి మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్.. వీడియో వైరల్

'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ మూవీ గురించి రామ్ చరణ్ మాట్లాడారు. మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడది లేదుగా.. అందుకే రాజమౌళి, మహేష్ సినిమా ఏడాదిన్నరలోపు విడుదలవుతుందని చెప్పారు.

New Update
ram charan about ssmb29

ram charan about ssmb29

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, గురువారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా మీద ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ విడుదలతో మరింత పెరిగాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

 ఏడాదిన్నర లోపే..

అయితే ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ రాజమౌళి సమక్షంలో రామ్ చరణ్‌ను..' మహేశ్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పగలరా?' అని ప్రశ్నించింది. దీనికి రామ్ చరణ్ నవ్వుతూ. "మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడది లేదుగా... అందుకే ఈ సినిమా ఏడాదిన్నరలోపు విడుదలవుతుంది" అని చెప్పాడు. 

దీనికి వెంటనే రాజమౌళి స్పందిస్తూ, "చరణ్‌కు బాగా ట్రైనింగ్ ఇచ్చాను, అందుకే ఇలా చెబుతున్నాడు," అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్..' చరణ్ అన్న చెప్పినట్లు ఈ ప్రాజెక్ట్ ఏడాదిన్నరలోపు రిలీజ్ అయితే బాగుంటుందని'.. ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment