మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మరో రెండు వారాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' థియేటర్లలో సందడి చేయబోతోంది. జనవరి 10న ఈ సినిమా విడుదలతో మెగా ఫ్యాన్స్‌కు సంక్రాంతి వేడుకలు ముందుగానే ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందు న్యూ ఇయర్ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 'గేమ్ ఛేంజర్' మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంది. 🔥🔥🔥GAME CHANGER TRAILER 🔥🔥🔥🔥🔥JAN 4th 🔥🔥 — CHITRAMBHALARE (@chitrambhalareI) December 28, 2024 Also Read : పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ అంతేకాకుండా లక్నోలో గ్రాండ్‌గా విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కట్‌పై పనులు జరుగుతున్నట్లు సమాచారం. ట్రైలర్ వచ్చే వారమే.. డిసెంబర్ 27న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని భావించినప్పటికీ, అది వాయిదా పడింది. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. తాజా సమాచారం ప్రకారం, జనవరి 4, 2025న థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నారట. ఇప్పటికే ఫ్యాన్స్‌లో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ జనవరి మొదటి వారంలో ఏపీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రియల్ గేమ్ ఛేంజర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా కనిపించనున్నారు.