మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్' ఇంకో పది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇటీవల యూఎస్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ జరుగనుంది. ఆ తర్వాత ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 4 వ తేదీకి ప్లాన్ చేశారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండడంతో, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. GameChanger Censore Done ✅ ✅ @alwaysramcharan 🥵It's U/A Certificate💥💥💥💥💥💥Talk Blockbuster anta 🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻Worldwide Release On Jan10th 🔥🔥🔥🔥#11DaystogoforgameChange pic.twitter.com/NYhXQsVgko — @Rc_chitti (@chittiaruncj) December 30, 2024 Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ హైలైట్స్ ఇవే.. గేమ్ ఛేంజర్ కు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సెన్సార్ టీమ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉండగా, ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్థాయిలో ఉందట. ముఖ్యంగా, సుమారు 20 నిమిషాల పాటు సాగే ట్రైన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్‌లో శంకర్ తన మేజిక్ చూపించారని, సినిమాకు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పెద్ద ప్లస్ అని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సెన్సార్ టాక్ ప్రకారం.. 'గేమ్ ఛేంజర్'.. శంకర్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే మూవీ అవుతుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?