/rtv/media/media_files/2024/12/23/9ggXDscevEURvfOTlj77.jpg)
ntr ram charan thaman
టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసిందే. 'RRR' తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సినిమా సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తరచూ కలిసి కనిపిస్తూ తమ స్నేహబంధాన్ని అందరికీ చాటిచెప్పారు.
సినిమా విడుదల నుండి ఆస్కార్ వేడుకల వరకు వారిద్దరూ కలిసే ఉన్నారు. ఆ తరువాత, మళ్ళీ కలిసి కనిపించింది చాలా తక్కువ. అయితే, సంగీత దర్శకుడు తమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు.
#Dhop MOMENT 🔥@tarak9999 @AlwaysRamCharan
— thaman S (@MusicThaman) December 23, 2024
WHAT FUNNNNNNNNN !!
It’s all BROTHER LOVE ❤️ pic.twitter.com/qlUNXMPg5Z
ఇది కూడా చదవండి: 'నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు'
దోప్ మూమెంట్..
తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇటీవల అమెరికాలో 'గేమ్ చేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, తమన్ ఈ వేడుక కోసం అమెరికా వెళ్లారు.
ఇప్పుడు తమన్ ఈ ఫోటోను షేర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తమన్ షేర్ చేసిన పిక్ అమెరికాలో దిగింది. అందులో తారక్ ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం
'వార్ 2' షూటింగ్ తో ముంబైలో బిజీగా ఉండాల్సిన ఎన్టీఆర్.. అమెరికాలో ఏం చేస్తున్నాడని ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా చరణ్, తారక్ ఇలా చాల రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.