/rtv/media/media_files/2025/01/11/dTcpZX6QUHm3wQziBrR5.jpg)
director sukumar
సినిమాలపై ప్యాషన్ ఉన్న దర్శకుల్లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం అతని తొలి చిత్రం 'ఆర్య' తోనే స్పష్టమైంది. 'ఆర్య' వచ్చిన సమయంలో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా విడుదలవుతూ ఉండేవి. అయితే, ఆ ట్రెండ్‌కు భిన్నంగా, సుకుమార్ తన తొలి సినిమాతోనే కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఇది అల్లు అర్జున్‌కి రెండో చిత్రం. ఆయన మొదటి సినిమా చూసిన కొందరు.. అల్లు అర్జున్ హీరోగా పనికిరాడని అన్నవారికి 'ఆర్య'తో వాళ్ళ నోళ్లు మూయించాడు.
ఈ సినిమాతో మొదలైన సుక్కు జర్నీ మళ్ళీ అల్లు అర్జున్ తోనే 'పుష్ప' తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చింది. ప్రెజెంట్ 'పుష్ప2' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో..
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
ఆ హీరో స్పూర్తితో ఇండస్ట్రీకి..
సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి ఒకప్పటి స్టార్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కారణమట. ఆయన స్ఫూర్తితోనే సుక్కు ఇండస్ట్రీకి వచ్చారట. ఇదే విషయాన్ని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు.' రాజశేఖర్‌కు నేను వీరాభిమానిని. ఆయన నటించిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు, మగాడు తదితర చిత్రాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. చదువుకొనే రోజుల్లో నేను ఆయన్ను ఇమిటేట్ చేస్తుండేవాడిని. నా పెర్ఫామెన్స్ మెచ్చి అందరూ ‘వన్స్‌మోర్’ అనేవారు. అలా నేను ఫేమస్ అయిపోయా. సినిమాల్లోకి వెళ్లి, ఏదైనా చేయగలననే నమ్మకం కలిగేందుకు అప్పుడు రాజశేఖరే కారణమయ్యారు..' అని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తో బిగ్ సక్సెస్..
ఆర్య తో తోలి సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఆ తర్వాత జగడం, ఆర్య 2, 100%లవ్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలతో తన క్రియేటివిటీని నిరూపించుకున్నారు. కానీ ఈ సినిమాలు భారీ విజయాలు సాధించకపోవడంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చలేదు. ఎన్టీఆర్ తో తీసిన 'నాన్నకు ప్రేమతో' ఆయనకు బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మేకోవర్ ను పూర్తిగా మార్చేసి అతనికో కొత్త లుక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ టైంలో ఈ లుక్ చాలా ఫేమస్ అయింది.
రామ్ చరణ్ తో ఇండస్ట్రీ హిట్
ఎప్పుడూ క్లాస్ స్టోరీస్ తో వచ్చే సుకుమార్ ఫస్ట్ టైం 'రంగస్థలం' తో జోనర్ మార్చి తనలోని మాస్ యాంగిల్ ను బయటపెట్టాడు. రామ్ చరణ్ లోని సిసలైన నటుడుని ఈ సినిమాతో చూపించాడు సుకుమార్. ఈ సినిమాలో సుకుమార్ మేకింగ్, టేకింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. డైరెక్టర్ గా సుకుమార్ ను ఓ మెట్టు పైకెక్కిచిన సినిమా ఇది. అంతేకాదు ఈ మూవీతోనే సుకుమార్, చరణ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
'పుష్ప' తో పాన్ ఇండియా డైరెక్టర్ గా..
సుకుమార్ తీసిన 'పుష్ప' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పార్ట్-1 తో అల్లు అర్జును ను ప్యాన్ ఇండియా హీరోగా నిలబెట్టాడు. ఈ మూవీలో సుకుమార్ రైటింగ్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక సెకండ్ పార్ట్ తో ఏకంగా బాహుబలి 2 రికార్డ్స్ ను బద్ధలు కొట్టాడు. ఇప్పుడు తెలుగు సినిమాకు సంబంధించి కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ గా నిలిచింది పుష్ప 2. ఈ క్రెడిట్ అంతా సుకుమార్ దే. 'పుష్ప 2'తో సుకుమార్ టాలీవుడ్ నెంబర్ 2 డైరెక్టర్ అయ్యాడు.