Naga Vamsi: దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి చూద్దాం.. చిటికెలు వేస్తూ సవాల్ విసిరిన నిర్మాత నాగవంశీ!

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంటే కొందరు దుష్పచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఫైరయ్యారు. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండని అన్నారు. మేము సినిమాలు తీస్తేనే వెబ్ సైట్లు, యూట్యూబ్‌లు బతుకుతాయని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

New Update
naga vamsi.

naga vamsi


ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ.69.4 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై కొందరు దుష్పచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ముఖ్యంగా సినిమా వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో కంటెంట్ లేదని.. కేవలం సీక్వెల్ అడ్వాంటేజ్ మాత్రమే ఉందని కొందరు రాశారని ఆయన మండిపడ్డారు. సినిమాలో కామెడీ అంతగా పండలేదని చాలా సైట్లు రాసుకొచ్చాయని అన్నారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అంతేకాకుండా ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు ఫేక్ అని.. కావాలనే మేకర్స్ కౌంట్ ఎక్కువ వేసి ప్రచారం చేసుకుంటున్నట్లు కొన్ని వెబ్ సైట్లు రాస్తున్నాయని.. ఆ వెబ్‌సైట్లపై ఆయన మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే మీడియాపై అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. దమ్ముంటే సినిమా కలెక్షన్లు ఫేక్ అని నిరూపించాలని సవాల్ విసిరారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

దమ్ముంటే బ్యాన్ చేయండి

ఈ మేరకు మీడియా రివ్యూయర్లపై ఫైర్ అయ్యారు. ‘‘మీకు మా మీద అంతగా పగ ఉన్నపుడు.. దమ్ముంటే మా సినిమాలను బ్యాన్ చేయండి. మా సినిమాల గురించి ఎవరూ ఆర్టికల్స్ గాని రివ్యూ గాని రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. దమ్ముంటే మమ్మల్ని బ్యాన్ చేయండి. చూసుకుందాం. మేము ఎలా మా సినిమాను ప్రమోట్ చేసుకోవాలో మాకు తెలుసు. మీ వెబ్ సైట్లు ప్రమోట్ చేస్తేనే మా సినిమాలు ఆడటం లేదు. మనమీద బతుకుతూ.. మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

నేను సినిమా తీస్తేనే మీ వెబ్ సైట్ రన్ అవుతుంది. నేను ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానెల్స్ రన్ అవుతాయి. మేము యాడ్ ఇస్తేనే.. మీ వెబ్ సైట్స్ రన్ అవుతాయి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు.. లేకపోతే.. వెబ్ సైట్లు మూసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 

(producer-nagavamsi | mad-square | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actor Manoj Kumar Passes Away: ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.

New Update
Veteran Actor Manoj Kumar Passes Away At 87

Veteran Actor Manoj Kumar Passes Away At 87 Photograph: (Veteran Actor Manoj Kumar Passes Away At 87)

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు. అలాగే ఉస్కార్, రోటీ కపడా ఔర్ మకాన్, జై హింద్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ఎంతగానో పేరు సంపాదించుకున్నారు. 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఎన్నో ఫిల్మ్స్ అవార్డ్స్ ఆయన అందుకున్నారు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ఆయన జీవితం - కెరీర్‌ప్రారంభ జీవితం, కెరీర్:

జూలై 24, 1937న హరికృష్ణ గిరి గోస్వామిగా జన్మించిన మనోజ్ కుమార్ హిందీ సినిమాలో ప్రముఖ వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

దేశభక్తి చిత్రాలు

"షహీద్" (1965), "ఉప్కార్" (1967), "పురబ్ ఔర్ పశ్చిమ్" (1970),  "రోటీ కప్డా ఔర్ మకాన్" (1974) వంటి దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన చిత్రాలలో నటించడం, దర్శకత్వం వహించడం ద్వారా మనోజ్ కుమార్ బాగా ప్రసిద్ధి చెందారు. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

అవార్డులు, గుర్తింపు

భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను మనోజ్ కుమార్ 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

ఇతర ప్రముఖ చిత్రాలు

దేశభక్తి చిత్రాలతో పాటు, అతడు "హరియాలి ఔర్ రాస్తా", "వో కౌన్ థి", "హిమాలయ కీ గాడ్ మే", "దో బదన్", "పత్తర్ కే సనమ్", "నీల్ కమల్", "క్రాంతి" వంటి ఇతర ప్రముఖ చిత్రాలలో కూడా నటించాడు, అలాగే దర్శకత్వం వహించాడు.

Advertisment
Advertisment
Advertisment