అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్‌ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ

గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్‌రాజును ప్రొడ్యూసర్ నాగవంశీ ఇరికించారు. తెలంగాణలో ఆయన సినిమాకి టికెట్‌రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే తమ సినిమాకి ఉంటాయని మీడియాతో అన్నారు. దిల్‌రాజు ఏం తెలుస్తారో దానిబట్టి చూస్తామన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది.

New Update
Producer Naga vamsi about dil raju game changer movie tickets hike

Producer Naga vamsi about dil raju game changer movie tickets hike

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు భారీ షాక్ ఇచ్చారు. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఎలాంటి అనుమతి ఇవ్వమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌కు బిగ్ షాక్ తగిలినట్లయింది. 

జనవరి 10న గేమ్ ఛేంజర్

త్వరలో బడా హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేష్, చిరంజీవి సహా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!  

ఓ వైపు టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ మూవీ నిర్మాత దిల్ రాజు తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజర్. దీంతో దిల్ రాజు ఏం చేస్తాడు? అంటూ సినీ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమాకి ఎక్కువగా బెనిఫిట్ షోలతోనే కలెక్షన్లు వస్తాయి. కానీ ఇప్పుడు అవి కూడా లేవంటే దిల్ రాజుకు పెద్ద దెబ్బేనని పలువురు అంటున్నారు.

దిల్ రాజ్ ఏం చేస్తాడో చూస్తా

ఇదే విషయంపై తాజాగా మరో ప్రముఖ నిర్మాత నాగవంశీ స్పందించారు. ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సీఎం రేవంత్ టికెట్ రేట్లు పెంచనని, బెనిఫిట్ షోలు ఉండవని అన్నారు కదా.. దీనిపై మీరెమంటారు అని నాగవంశీని మీడియా అడిగింది.

దానికి ఆయన స్పందిస్తూ.. మొదట నిర్మాత దిల్ రాజు సినిమా ఉందని.. ఆయన సినిమాకు టికెట్ హైక్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే తమ సినిమాలకు ఇస్తారని అన్నారు. దిల్ రాజు ఏం తెలుస్తారో దాని బట్టి చూస్తామని చెప్పారు. దీంతో పలువురు కామెంట్లు పెడుతున్నారు. మీ సినిమాల గురించి చెప్పమంటే దిల్ రాజును బాగా ఇరికించావని నాగవంశీపై మండిపడుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment