/rtv/media/media_files/2026/04/22/producer-chittibabu-2026-04-22-13-46-52.jpg)
Producer Chittibabu
Producer Chittibabu: వెటరన్ సినీ వ్యక్తి, నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు అలాగే బీజేపీ నాయకుడు(BJP Leader) అయిన చిట్టి బాబు నిన్న సాయంత్రం 5:30 గంటలకు, 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన చిట్టిబాబు, తెలుగు, తమిళ పరిశ్రమల్లో అనేక మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. భారతీరాజా Bharathiraja, కె.ఎస్.ఆర్.దాస్ K. S. R. Das, కన్నదాసన్ Kannadasan, వాలి Vaali, ఎం.ఎస్.విశ్వనాథన్ M. S. Viswanathan, ఆచార్య ఆత్రేయ Acharya Aatreya, సిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharama Sastry వంటి ప్రముఖులతో కలిసి తన ప్రతిభను చాటుకున్నారు.
Also Read: టాలీవుడ్ లో విషాదం... ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు మృతి
Producer Chittibabu About Heroine Soundarya
దర్శకుడిగా మారే ముందు 47 సినిమాలకు సహ దర్శకుడిగా పని చేశారు. ఆయన తొలి సినిమా “సంతానం” మంచి విజయాన్ని సాధించింది. తర్వాత మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కూడా దాదాపు 30 సినిమాల్లో కనిపించారు. నిర్మాతగా కూడా ఆయన పరిశ్రమకు ఎంతో సేవ చేశారు.
అనేక కొత్త ప్రతిభావంతులను పరిచయం చేసి వారికి ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకునేలా చేశారు. వారిలో కృష్ణ వంశీ Krishna Vamsi, శివ నాగేశ్వరరావు Siva Nageswara Rao, శోభన్ Shoban, రసూల్ ఎల్లోర్ Rasool Ellore, సౌందర్య Soundarya, పరుచూరి బ్రదర్స్ Paruchuri Brothers వంటి వారు ఉన్నారు.
ఇక దివంగత నటి సౌందర్య గురించి ఆయన చెప్పిన ఒక విషయం కూడా గుర్తు చేసుకొవాలి. ఆమె తండ్రి ముందే ఆమె భవిష్యత్తు గురించి చెప్పారని, కొంతకాలం తర్వాత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే తెలిపారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని సౌందర్యకు పూర్తిగా చెప్పకుండా, పరోక్షంగా మాత్రమే సూచించారట.
Also Read: సినిమా వచ్చి 16 ఏళ్ళైనా అదే క్రేజ్.. థియేటర్లో "డార్లింగ్" ఫ్యాన్స్ సందడి షురూ..!
ఒకసారి సౌందర్యను కలిసినప్పుడు, ఆమె ఇప్పటికే పెద్ద స్థాయికి చేరుకున్నదని, ఇక కుటుంబంతో జీవితం గడపాలని చెప్పినట్లు చిట్టిబాబు చెప్పారు. అయితే సౌందర్య మాత్రం చివరి వరకు సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పింది. ఆమె కూడా చెప్పినట్టుగానే, దాదాపు 100 సినిమాల్లో నటించి, నటిగా ఉన్నప్పుడే అకాలంగా మరణించింది.
ఇలాంటి ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు తన జీవితంలో భాగం చేసుకున్న చిట్టి బాబు ఇక లేరు. ఆయన మరణంతో సినీ రంగం ఒక అనుభవజ్ఞుడిని కోల్పోయింది.
Follow Us