Prabhas Kalki 2: 'కల్కి 2' క్రేజీ అప్‌డేట్.. పెద్ద ప్లానింగే..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపారు. పార్ట్ 2లో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలుగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపిస్తారు.

New Update
prabhas kalki 2

prabhas kalki 2

Prabhas Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) గతేడాది విడుదలై భారతీయ సినీ ప్రపంచానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని చిత్రబృందం ముందే ప్రకటించింది. తాజాగా, 'కల్కి 2' గురించి చిత్ర నిర్మాత అశ్వనీదత్(Ashwini Dutt) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్ అశ్విన్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

Aslo Read :  Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు 'కల్కి 2' - Prabhas Kalki 2 

అశ్వనీదత్ మాట్లాడుతూ కల్కి 2 (Kalki 2) వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగంలో కమల్ హాసన్(Kamal Hassan) ప్రధాన పాత్రలో ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే సినిమాకు ప్రధాన అస్త్రాలు. వీరితో పాటు, దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. కొత్త నటులను తీసుకోవడం గురించి నేను భావించడం లేదు, కానీ కథకు అవసరమైతే కొత్త పాత్రలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

నాగ్ అశ్విన్ గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ, "మహానటి చిత్రంతోనే తన టాలెంట్ స్పష్టంగా చూపించాడు. ఆ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి తరువాత, 'కల్కి' ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. రెండు సినిమాలు కూడా అద్భుత విజయాలు సాధించాయి. నాగ్ అశ్విన్ కు జీవితంలో ఎలాంటి ఓటమి ఉండదని నాకు నమ్మకం ఉంది. అతడి ఆలోచనా విధానం, సినిమాలు డైరెక్ట్ చేసే విధానం అద్భుతంగా ఉంటాయి." అని అన్నారు.

Also Read :  Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!

'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద ఒక కొత్త మార్కును స్థాపించింది. ఈ చిత్రం ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది, అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) అతిథి పాత్రలతో సినిమాకు ప్రత్యేకతను ఇచ్చారు. ప్రభాస్ బౌంటీ ఫైటర్ భైరవగా, చివర్లో కర్ణుడిగా తన అద్భుతమైన నటనతో అదరగొట్టి, పార్ట్ 2 పై అంచనాలను మరింత పెంచాడు.

Also Read: Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..3600 సార్లు..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు