Prabhas Upcoming Movies: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే సర్జరీ కోసం ఫారిన్ వెళ్లిన ప్రభాస్ త్వరలో హైదరాబాద్ తిరిగి రానున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ త్వరలోనే "ఫౌజీ" సినిమా షూటింగ్ సెట్‌కి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేసారు మేకర్స్. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది, అలాగే ఇందులో "రాధేశ్యామ్" లాంటి ప్రేమ కథ కూడా ఉంటుందని అభిమానుల అంచనా.
Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
స్పీడ్ పెంచిన ప్రభాస్..
ఫౌజీ షూటింగ్ పూర్తయిన వెంటనే, ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ "రాజా సాబ్" పై దృష్టి పెట్టనున్నారు. ఆయన కాల్షీట్ ప్రకారం, రాజాసాబ్ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా ? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. "రాజాసాబ్" సినిమాతో ప్రభాస్ అభిమానులు కొత్త అనుభవాన్ని పొందతారని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
Also Read: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
ఈ సినిమాలు పూర్తయిన తర్వాత, ప్రభాస్ "సలార్" సీక్వెల్ పై ఫోకస్ పెట్టనున్నారు. "సలార్ 2" పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి "సలార్" సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సో.. ఈ సీక్వెల్‌కి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
Also Read: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?
కల్కి నిర్మాత అశ్వనీదత్ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కల్కి సినిమాకు సంబంధించిన అన్ని కేరక్టర్లు కల్కి పార్ట్ 2 లో కూడా కంటిన్యూ అవుతాయని, అవసరమైతే కొత్త పాత్రలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సో.. ప్రభాస్ కల్కి 2 కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. మరోవైపు, సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న "స్పిరిట్" మూవీకి కూడా భారీ హైప్ ఉంది. ఇన్ని ప్రాజెక్టులను ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి మరి.