Posani Krishna Murali Arrest: ఖైదీ నంబర్ 2261గా పోసాని.. సబ్ జైలుకు తరలింపు!

టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన్ను రాజాంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించినట్లు తెలుస్తోంది.

New Update
Posani Krishna Murali Arrest

Posani Krishna Murali Arrest

టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీకి కోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను రాజాంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

9 గంట‌ల పాటు విచారణ

పోసానిని గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో దాదాపు 9 గంట‌ల పాటు విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు. అనంతరం అక్కడ నుంచి నిన్న రాత్రి 9.30 గంటలకు పోలీసులు రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఇరుపక్షాల వాద‌న‌లు కొన‌సాగాయి. అదే సమయంలో పోలీసుల తరఫు లాయర్లు రిమాండ్ రిపోర్టును కోర్టుకి సమర్పించారు. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!

పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు. మరోవైపు పోసాని త‌ర‌ఫున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోసాని తరఫున పొన్నవోలు సుధాక‌ర్‌ వాద‌న‌లు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాక‌రించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వ‌ర‌కు రిమాండ్‌లో ఉండ‌నున్నారు. 

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విష‌యాలను బయటపెట్టారు. పోసాని త‌న మాటలతో కులాల మ‌ధ్య చిచ్చు పెట్టార‌ని అభియోగాలు మోపారు పోలీసులు. అంతేకాకుండా ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ఆయ‌న కుటుంబంపై నోటికి వ‌చ్చిన‌ట్లుగా దూషించార‌ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. అక్కడితో ఆగకుండా ఆయన నంది అవార్డుల క‌మిటీపై కూడా కులం పేరుతో అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారని పేర్కొన్నారు. అలాగే నారా లోకేశ్‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టార‌ని అందులో తెలిపారు. 

ఏం జరిగిందంటే?

పోసాని కృష్ణ మురళి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో సైతం వారిపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ.. పోసానిపై పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే

అనంతరం ఆయనపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోసానిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆయనకి సంబంధించిన పలు వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment