గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో పవన్.. టికెట్ రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని చాలా మంది ప్రశ్నిస్తారు. ఇది డిమాండ్ అండ్ సప్లై రూల్. నేను కూడా శంకర్ గారి సినిమాను బ్లాక్‌లో టికెట్లు కొనుగోలు చేసి చూశాను. అది నా వ్యక్తిగత ఇష్టం. అలా బ్లాక్‌లో కొనుగోలు చేసే డబ్బులు ఎవరికో వెళ్తాయి. ఇది కూడా చదవండి: Pawan; సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల! ప్రతి ఒక్కరూ తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజే చూడాలని ఆశపడతారు. సినిమాల బడ్జెట్ పెరిగిన దాంతో మార్కెట్ కూడా పెరిగింది. టికెట్ రేట్లు పెరిగిన ప్రతిసారీ, దానికి సంబంధించిన 18 శాతం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. నా సినిమాకు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, మేము ఇతర హీరోల సినిమాలను సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. సినిమాలకు రాజకీయాలు కలపడం తగదు. టికెట్ రేట్ల సమస్య పరిష్కారానికి హీరోలు ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేదు. దీన్ని నిర్మాతలు, బిజినెస్‌లో ఉన్నవారు చూసుకోవాలి. హీరోలు ప్రత్యేకంగా ఎవరికీ నమస్కారం పెట్టాల్సిన పనిలేదు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగు సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ప్రశంసించారు. ప్రస్తుతం టికెట్ రేట్ల పెంపు వల్ల ఏపీ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతోంది. ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి ప్రతి రూపాయి మీద 18 శాతం ఆదాయం లభిస్తుంది.." అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కూడా చదవండి: BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు!