Hari Hara Veera Mallu Song: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం మూడు సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది ‘హరిహర వీర మల్లు’, ‘ఓజి’(OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh). ఈ ప్రాజెక్టులకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రతి వారంలో రెండు రోజులు మాత్రమే షూటింగ్ కోసం కేటాయించబోతున్నారు. నిర్మాతలు, పవన్ కళ్యాణ్ టైమును సేవ్ చేసేందుకు, అమరావతి(Amaravati) పరిసర ప్రాంతాల్లోనే సినిమా సెట్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కనిపించే సీన్స్ , అలాగే మిగిలిన సన్నివేశాలంతా చాలా వరకు షూటింగ్ పూర్తయ్యాయి.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
ఈ మూడు సినిమాల్లో, ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ ‘హరిహర వీర మల్లు’. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమా కొంత భాగం క్రిష్(Director Krish) దర్శకత్వం వహించారు, కానీ పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ ఆలస్యం కావడంతో, క్రిష్ అనుష్క(Anushka) సినిమాకు షిఫ్ట్ అయ్యారు. ఇంక చేసేది ఏమి లేక నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మొదట ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నారు, కానీ ఎక్కువ రన్ టైమ్‌తో ఒకే భాగంగా, విడుదల చేయాలని దర్శకులు, నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘హరిహర వీర మల్లు’ మార్చి 28న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఆ తేదీకి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే మూవీ యూనిట్ ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసారు.
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
𝟑𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐕𝐈𝐄𝐖𝐒 & counting for #HariHaraVeeraMallu 1st Single in 24 Hours! 💥🌪
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 18, 2025
𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐓𝐎𝐏 #𝟏 on #YouTube 🔥
- https://t.co/5ObGwP2Rc6#MaataVinaali #BaatNirali #KekkanumGuruve #MaathukeLayya #KelkkanamGuruve
Sung by the one and only, POWERSTAR… pic.twitter.com/gFLOrHxtIM
AI సహాయంతో పవన్ గొంతును వాడి..
ఇందులో భాగంగా, ‘మాట వినాలి’ అనే లిరికల్ సాంగ్‌ను(Maata Vinaali Lyrical Song) విడుదల చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డైలాగులు ఫ్యాన్స్‌ను అలరించాయి, సోషల్ మీడియాలో ఈ పాట మంచి క్రేజ్ సంపాదించింది. ఈ పాటను 5 భాషల్లో విడుదల చేశారు, పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినట్లుగా ప్రకటించారు, కానీ పవన్ కళ్యాణ్ తెలుగు వెర్షన్‌లో మాత్రమే పాడారట. మిగిలిన భాషల వెర్షన్లకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పవన్ గొంతును వాడారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ ఐడియా దర్శకుడు జ్యోతికృష్ణదని టాక్, అన్నీ టెక్నికల్ అంశాలు పరిగణనలో పెట్టుకుని, బడ్జెట్, టైం సేవ్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.