పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా, అభిమానులు "ఓజీ.. ఓజీ.." అంటూ నినాదాలు చేస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. సాధారణంగా ఈ నినాదాల్ని నవ్వులతో స్వాగతించే పవన్, కడపలో జరిగిన ఓ సమావేశంలో మాత్రం కొంత అసహనానికి లోనయ్యారు. Pawan Kalyan about OG and shootings of upcoming movies 😂 pic.twitter.com/EOCVxIllKp — FSIC (@shr3hs) July 3, 2024 Also Read: 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ "ఏంటయ్యా ఇది? ఎప్పుడు ఏ నినాదం చేయాలో మీకు తెలియదా? పక్కకు పోయండి" అంటూ ఫ్యాన్స్ పై కోప్పడ్డారు.. అయితే తాజాగా మంగళగిరిలో విలేకరులతో జరిగిన చిట్‌చాట్ లో పవన్ తన సినిమాలపై స్పందించారు.' ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. - OG OG అంటూ గొడవ చేయకండి..- నేను మీసం తిప్పినా, చాతి కొట్టుకున్నా ఉపయోగం లేదు...- సినిమాలకు, హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు!- డీసీఎం పవన్ కళ్యాణ్#PawanKalyan #OG #TheyCallHimOG pic.twitter.com/ZrNb1AwFD7 — Filmy Focus (@FilmyFocus) December 20, 2024 అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. "OG OG" అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు. "హరిహర వీరమల్లు" మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తా..' అని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా