Pareshan Boys Imran: అంతా అన్వేషే చేశాడు.. బోరున ఏడ్చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

New Update
Pareshan Boys Imran

Pareshan Boys Imran

బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తాను చేసే పనులు నచ్చకపోతే తనను ప్రశ్నించొచ్చు.. కానీ తన తల్లి ఏం చేసిందని అన్నాడు. అంతేకాకుండా తన తండ్రి బతికే ఉంటే.. చనిపోయాడని చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్స్‌కు తాము వ్యతిరేకం కాదని.. పెద్ద వాళ్లు ప్రమోట్ చేశారనే తాము కూడా ప్రమోట్ చేశాం అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు