Pareshan Boys Imran Khan betting app promoting video once again viral
బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన 11 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ 11మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోటీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ 11 మంది తమ ఫోన్లను స్విఛాఫ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ఒకడు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
అడ్డంగా దొరికిపోయిన ఇమ్రాన్
చిన్న పిల్లలతో వీడియోలు చేసి బాగా పాపులర్ అయిన ఇమ్రాన్.. అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంత జరిగినా అతడిలో మార్పురానట్లు తెలుస్తోంది. అతడు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా అతడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
అందులో ఇమ్రాన్.. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెడితే ఈజీగా ఇంటి వద్ద నుంచే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పడం చూడవచ్చు. తనకు కూడా అధిక డబ్బులు వచ్చాయని అందులో ఇమ్రాన్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం తెలంగాణ పోలీసుల వేట మొదలు పెట్టారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసేశాడు.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
అదే సమయంలో ఇమ్రాన్ కోసం RTV టీం అన్వేషణ ప్రారంభించింది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో ఉన్న అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ అతడు లేకపోయే సరికి రూటు మార్చింది. శ్రీశైలం నేషనల్‌హైవే రూట్‌లోని.. దోమలపెంటలో ఎకరా స్థలంలో ఇమ్రాన్ కాటేజీకి వెళ్లింది. ఈనెల 13వ తేదీ వరకు ఇమ్రాన్ ఆ కాటేజీలోనే ఉన్నట్లు సమాచారం అందడంతో RTV టీం అక్కడకు చేరుకుంది. కానీ అంతలోపే ఇమ్రాన్ బబ్బుతో పాటు తన టీమ్‌ను తీసుకుని పరారయ్యాడు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..