Pankaj Tripathi: బాలీవుడ్‌ అందులో విఫలమైంది: ‘మీర్జాపూర్’ నటుడు షాకింగ్ కామెంట్స్!

‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి బాలివుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు బాలీవుడ్‌తో కనెక్ట్ కాలేకపోవడానికి గల కారణాన్ని ఆయన తెలిపారు. 90's సినిమాల్లో ఏదో తెలియని మాయాజాలం ఉండేదని అన్నారు. కానీ ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ లేదన్నారు.

New Update
Pankaj Tripathi sensational comments on Audiences Are Unable To Connect With Bollywood

Pankaj Tripathi sensational comments on Audiences Are Unable To Connect With Bollywood

Pankaj Tripathi: ఈ యాక్టర్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ముఖ్యంగా ఆయన పేరు తెలియకపోవచ్చు కానీ.. ‘మీర్జాపూర్’(Mirzapur Series)లోని కలీన్ భయ్యా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సిరీస్‌లో అతడి యాక్టింగ్‌కు ఫిదా అవ్వని వారే ఉండరు. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి మున్నాభాయ్ తండ్రిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. 

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

తాజాగా ఈ యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన బాల్యం సహా సినిమాల్లో తన ప్రయాణం వంటి అనేక విషయాల గురించి ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు బాలీవుడ్‌తో కనెక్ట్ కాలేకపోవడానికి గల కారణాన్ని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గ్రౌండ్ లెవెల్ స్టోరీలను చూపించకపోతే ప్రేక్షకులు సినిమాలతో ఎందుకు కనెక్ట్ అవుతారంటూ ప్రశ్నించారు. 

Also Read: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!

అప్పట్లో ఏదో మాయజాలం

గతంలో 90'sలలో తీసిన సినిమాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేవారని.. అప్పటి సినిమాల్లో ఏదో తెలియని మాయాజాలం ఉండేదని అన్నారు. అందుకే చిన్న చిన్న ఫ్యామిలీలు సైతం ఆ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించేవన్నారు. అదే స్థాయిలో వారు హ్యాపీగా ఫీలయ్యేవారని.. నటులు ఏడిస్తే వారూ ఏడ్చే వారని.. నటులు నవ్వితే వారూ నవ్వేవారని పేర్కొన్నాడు. 

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు

కానీ ఇప్పటి సినిమాల్లో ఆ మ్యాజిక్ లేదన్నారు. కేవలం వినోదం కోసం మాత్రమే సినిమాలు చూస్తున్నారన్నారు. నటుల పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం లేదని.. తమకు సంబంధించిన వారికోసం మాత్రమే సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఇక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టోరీ ఉంటే మాత్రం ఎన్ని సార్లు విడుదలైన ఆ సినిమా చూస్తారని అన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు